- Advertisement -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మునుగోడు నియోజక వర్గం చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై అసత్యాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తుందన్నారు. ముందుగా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాకే గ్రామాల్లో పర్యటించాలన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించిన పార్టీకే ఓటు వేస్తామని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక బండి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
- Advertisement -