తెలుగు తెర రాకుమారుడు … పడుచుపిల్లల మనసు దోచే గ్రీకువీరుడు . అదరక బదులే చెప్పేటి నిప్పుకణం అతడు. భారీ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బిజినెస్ మ్యాన్. చిరునవ్వుతోనే బ్రహ్మోత్సవం చేసే శ్రీమంతుడు. రాజకుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పోకిరిగా హల్ చల్ చేసి.. అభిమానులకు గుండెల్లో మురారిగా మారి స్పైడర్గా చెరగని ముద్రవేసుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు.. పుట్టిన రోజు నేడు.
నటశేఖర కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించాడు. నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా నీడ సినిమాతోతెరంగేట్రం చేశాడు. దర్శకేంద్రుడు కె.రాఘవెంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్. ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’, దూకుడు’ మరియు ‘బిజినెస్ మాన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తనఖాతాలో వేసుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ‘నాని’, ‘మురారి’ మరియు ‘నిజం’ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా తీసి మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మల్టీస్టారర్ మూవీస్ కి ట్రెండ్ కి మళ్లీ తెరలేపాడు. ఇప్పటివరకు ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను సొంతం చేసుకున్న ప్రిన్స్.. ప్లాఫ్ వచ్చినా.. హిట్ వచ్చినా.. ఒకేలా ఫీలవుతుంటారు. అందుకే ఆయన కోసం రచయితలు, దర్శకులు క్యూ కడుతుంటారు.
మ..హే..శ్ ఆ పేరులో ఏదో మత్తుంది.. ఇది ఓ సినిమాలో డైలాగ్.. కానీ నిజంగానే అమ్మాయిలు అతన్ని పేరు వినబడగానే.. ఒళ్లంతా థ్లిల్లంతగా ఫిలవుతారు. ప్రిన్స్ సినిమా వస్తుందంటే చాలా అభిమానులు పండగే. అమ్మాయిల మనసుల్ని దోచుకునే పోకిరి. తన స్మైల్ తోనే అందరిని కట్టి పడేసే మహేశ్.. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని కొరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.