- Advertisement -
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ నిత్యామీనన్. తాజాగా విజయ్ సేతుపతితో నిత్యా నటించిన చిత్రం విడుదల కాగా తాజాగా జరిగిన ప్రెస్మీట్లో నిత్యా ఓ యూ ట్యూబర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
సంతోష్ వర్కీ అనే యూట్యూబర్ ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. సినిమా రివ్యూలతో ఫేమస్ తెచ్చుకున్న సంతోష్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేశాడని వెల్లడించారు. సంతోష్ నాకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్స్ చేస్తూ విసిగించాడు. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. కానీ నేను అతనిని క్షమించి వదిలేశానని తెలిపారు.
- Advertisement -