ఎంపీ సంతోష్ కుమార్‌కు సద్గురు లేఖ…

95
santhosh
- Advertisement -

దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి రాసిన లేఖలో “సేవ్ సాయిల్ మూమెంట్” సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు.

ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాను యూరప్ లో మొదలుపెట్టి సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఇండియా లలో 100 రోజుల్లో 30 వేల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి 3.9 బిలియన్ల ప్రజలకు “సేవ్ సాయిల్” సందేశం చేరవేసినట్టు లేఖలో ఆయన తెలిపారు. నేలను కాపాడేందుకు “దేశంలో రైతులు వ్యవసాయంలో 3-6% సేంద్రియ పద్దతులను అనుసరించేలా చేయడం”. రైతులకు “కార్బన్ క్రెడిట్ ఇన్సెంటీవ్స్” అందించేందుకు కృషిచేయడం, “పండిన పంట పోషకాల ఆధారంగా కాకుండా.. అవి పండించిన నేలలోని సేంద్రియ లెక్కల ఆధారంగా లేబుల్ చేయడం” అనే మూడు ఆశయాలతో ముందుకు సాగుతున్నట్టు.. అందుకోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు సద్గురు తెలిపారు. అంతేకాదు, “సేవ్ సాయిల్” మూవ్ మెంట్ ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఎంపీ సంతోష్ కుమార్ నుంచి మరింత సహకారం ఆశిస్తున్నట్టు లేఖలో తెలిపారు.

సద్గురు లేఖపై స్పందించిన సంతోష్ కుమార్.. “సేవ్ సాయిల్” మూమెంట్ అద్భుతమైన కార్యక్రమమని.. అందుకే హైదరాబాద్ లో సద్గురు నిర్వహించిన “సేవ్ సాయిల్” కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను భాగం చేసినట్టు తెలిపారు. మట్టిని కాపాడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -