వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగష్టు 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రాగా థియేట్రికల్ బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం – రూ.5 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఆంధ్ర – రూ.6.50 కోట్లులో బిజినెస్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.1.10 కోట్లు,ఓవర్సీస్ – రూ.1 కోటి రూపాయలు బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా రూ.15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.16 కోట్లు రాబట్టాలి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి..