పోలీస్‌ కమాండ్ కంట్రోల్.. ప్రత్యేకతలు ఇవే..!

34
kcr cm
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 1.16 నిమిషాలకు సీసీసీని ప్రారంభించనున్నారు. రాష్ట్రం నలుమూలలా అమర్చిన దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజీని ఇక్కడి నుంచే మానిటర్ చేయనున్నారు.

ఈ కమాండ్ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 12లో.. 585 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. మొత్తం ప్రాజెక్ట్‌ను.. 6 లక్షల 42 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులో 5 టవర్లు ఉన్నాయి. టవర్ ఏ‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 19 అంతస్తులున్నాయి. టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి. టవర్ ఏ పైభాగంలో.. 15 మంది కెపాసిటీ గల హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా.. హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.

టవర్ బి లో.. 15 అంతస్తులున్నాయి. ఇందులో.. టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ ఉండనుంది. టవర్ సీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆడిటోరియంతో పాటు రెండు అంతస్తులున్నాయి. టవర్ డీలో.. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇందులోనే.. మీడియా బ్రీఫింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ చుట్టూ35 శాతం గ్రీనరీ పెంచారు. 600 వాహానాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లోర్ ఫ్లోర్ కు సోలార్ ప్లాంటులు ఉన్నాయి. ఇక.. టవర్ ఈ లో.. కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉన్నాయి. టవర్ Aలోని నాలుగో అంతస్తులోనే.. డీజీపీ ఆఫీస్, 18వ అంతస్తులో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. 14వ ఫ్లోర్‌లో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

- Advertisement -