యావత్ ప్రపంచానికి ఉత్కంఠ రేపిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. చైనా హెచ్చరికలు భేఖాతరు చేస్తూ నిన్న రాత్రి ఆ దేశ రాజధాని తైపేలో అడుగుపెట్టారు పెలోసీ. ఈ ఉదయం తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె… సాయంత్రం తైపీ నుంచి దక్షిణకొరియా బయల్దేరారు. తైవాన్ అధ్యక్షురాలితో భేటీ అనంతరం పెలోసీ విలేకరులతో మాట్లాడారు. తైవాన్‌కు తాము ఒంటరిగా వదిలేయబోమని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి అమెరికా మద్దతు అత్యంత కీలకమన్నారు. దాన్ని స్పష్టంగా చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. తైవాన్‌లో స్వయం పరిపాలనకు తాము సంఘీభావంగా ఉంటామని స్పష్టం చేశారు. పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆమె తైపేలో అడుగుపెట్టిన వెంటనే డ్రాగన్ లైవ్ ఫైర్ మిలిటరీ డ్రీల్స్‌ను ప్రారంభించింది.
పెలోసీ తైపే పర్యటన ముగిసింది
- Advertisement -
- Advertisement -

