- Advertisement -
దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని…అలాంటి న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలన్నారు సీజేఐ రమణ. ఢిల్లీలో జరిగిన నల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో మాట్లాడిన ఆయన..దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు కోర్టులు 24 గంటల పాటు పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టేందుకు అన్ని కోర్టుల్లో మౌళికసదుపాయాలను విస్తరించినట్లు ప్రధాని తెలిపారన్నారు.
సమాజంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలని, న్యాయం కూడా అందరికీ సమానంగా అందాలన్నారు.
- Advertisement -