- Advertisement -
ఊరమాస్ లుక్లో దర్శనమిచ్చారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. హరీష్ శంకర్ డైరెక్షన్లో సరికొత్త యాడ్లో యాక్ట్ చేశాడు. ఈ యాడ్ షూట్ కోసం మరో నయా లుక్లో కనిపించాడు. బన్నీని ఊర మాస్ లుక్ కనపడేలా చేంజ్ చేశారు. ఈ లుక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్.
ఇందులో చెవి పోగులు, సైడ్ కటింగ్, షర్ట్ మీద షర్ట్, మేడలో చైన్, ఉంగరాలు, నోట్లో సిగార్, కళ్ళజోడు పెట్టుకొని ఫుల్ మాస్ గా కనిపించాడు. ఈ ఫోటో షేర్ చేసి..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు బన్నీ. బన్నీని ఈ రేంజ్ లో మాస్ లుక్ లో చూడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
- Advertisement -