- Advertisement -
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 44,769 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతుండటంతో జలాశయం నుంచి 3244 క్యూసెక్కుల వదర దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. నీటినిల్వ సామర్థం 312.40 టీఎంసీలు కాగా ప్రస్తుతం 219.57 టీఎంసీల నీటి నిల్వుంది.
ఇక శ్రీశైలంకు కూడా ఎగువనుండి భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 1,06,750 క్యూసెక్కుల వరద వస్తుండగా 43,492 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది.
- Advertisement -