ప్రస్తుత టెకీ యుగంలో టచ్ ఫోన్లు వాడని వారంటు ఎవరూ లేరు. కాని భారత్-చైనాల మధ్య నేలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వల్ల టిక్‌టాక్‌తో సహా సుమారు 100 వరకు యాప్‌లను బ్యాన్ చేశారు. కాని ఇదే అదనుగా మార్కెట్లోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ను ఇప్పుడు ఎక్కువగా అదరిస్తున్నారు. ప్రస్తుతం షార్ట్ వీడియోలు తీయాలంటే ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌కు కొన్ని కొత్త సోబగులు అద్దారు. వాటి ద్వారా డ్యూయల్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది.
ఇన్స్టాగ్రామ్ డ్యూయెల్ ఫీచర్‌ని ప్రకటించింది. దీంతో యూజర్ ఒకే సమయంలో ఫోన్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను ఉపయోగించి రీల్స్‌ను రికార్డ్ చేయవచ్చు.‘డ్యూయల్ ఫీచర్’ని ఇలా ఉపయోగించాలి…
♦ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి.
♦ స్క్రీన్ టాప్రైట్లో ఉన్న ప్లస్ ఐకాన్ నొక్కాలి.
♦ ‘రీల్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ లెఫ్ట్‌సైడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
♦ డ్యూయల్ లేబుల్‌తో ఉన్న కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ ‘రికార్డ్’ ఐకాన్ నొక్కాలి. రికార్డింగ్ తరువాత ఎఫెక్ట్స్, మ్యూజిక్ యాడ్ చేయాలి.