- Advertisement -
ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడ్య జీవన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలోని కమ్మవారి కల్యాణ మండపంలో మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ ఎస్ కే రహమాన్, సీఐ సురేష్, ఎస్ఐ వీర ప్రసాద్, వైరా మండల యూత్ విభాగం అధ్యక్షులు జవ్వాజి నాగరాజు, వైరా మండల టిఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి మెరుగు రత్నారాజు, మాతంగి రాంబాబు, తడికమల్ల నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -