- Advertisement -
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిజాం కాలేజీలో ఎంబీఏ ప్రారంభోత్సవం సందర్భంగా టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భీమ్ నాయక్, హెచ్‌వోడీ తిరుపతి నాయక్, విద్యార్థి నాయకుడు తుంగబాలు, తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… పర్యవరణాన్ని పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -