నల్లగా ఉన్నారా.. హైఫైవ్‌ ఇవ్వం….

83
sesame
- Advertisement -

అమెరికాలో జాతి వివక్ష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వివక్షకు ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు కొంతమందైతే శ్వేత జాతీయుల నర నరాన జాతి వివక్ష ధ్వనిస్తోందంటే అతిశయోక్తి కాదు. తాజాగా చిన్నారుల పట్ల ఓ వ్యక్తి జాతి వివక్ష ప్రదర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులు అతడు పనిచేస్తోన్న సంస్థపై పరువు నష్టం దావా వేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దారుణ ఘటన చోటుచెసుకుంది.

ఫిలడెల్ఫియాలోని సెసేమ్ స్ట్రీట్ థీమ్ పార్క్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి జనం పోటెత్తారు. పలువురు వ్యక్తులు ప్రత్యేక వేషధారణతో ప్రజలను అలరించారు. రోసిటా అనే క్యారెక్టర్ తెల్లజాతి పిల్లలకు హైఫైవ్ ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు. అయితే అక్కడే ఉన్న నల్లజాతి చిన్నారులు హైఫైవ్ కోసం చేయి చాపగా.. రోసిటా అనే క్యారెక్టర్ నో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో చిన్నారులు చిన్నబోయారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మరికొంతమంది నల్లజాతి చిన్నారులకు కూడా ఇదే ఘటన ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా..జాతి వివక్షను పలువురు నెటిజన్లు ఖండించారు.

ఈ నేపథ్యంలో జాతి వివక్ష చూపించిన సెసేమ్ సంస్థ పై చిన్నారి తల్లిదండ్రులు 25 మిలియన్ డాలర్ల దావా వేశారు. కేవలం తన కూతూరు నల్లగా ఉండడం వల్లే హైఫైవ్ ఇవ్వలేదని వారు ఆరోపించారు. మరోసారి ఆ పార్క్ లో అడుగుపెట్టను అంటూ జోడి బ్రౌన్ తెలిపారు. అయితే ఈ ఘటనపై సెసేమ్ థీమ్ పార్క్ క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. అదేవిధంగా కాస్ట్యూమ్ క్యారెక్టర్లు వేసేవారికి శిక్షణ ఇస్తామని తెలిపింది.

- Advertisement -