గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వికరిస్తూ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS మూడు మొక్కలు నాటారు. మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…..రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది అని ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు యంపీ శ్రీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని ఎస్పీ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం , ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అన్నారు…
గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అలాగె ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని తెలిపారు…
అనంతరం జిల్లా ఎస్పీ జగిత్యాల అడిషినల్ ఎస్పీ రూపేష్, రామగుండం అడిషినల్ డిసిపి అఖిలమహాజన్,మునుగురు ఏఎస్పీ శబరిష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.