మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. జులై 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాని హాజరై రవితేజపై ప్రశంసలు గుప్పించారు. రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు రవితేజ అన్న ఇన్స్పిరేషన్ అని తెలిపారు.
ప్రతి జనరేషన్ కి ఇలా ఒకడు ఉంటాడు. ఈ జనరేషన్ కి రవి అన్న అలాంటోడు. తనకు రవి అన్నతో సినిమా చేయాలని ఉంది. ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ టీమ్ ను అభినందించడం ఒక బాధ్యత గా ఫీల్ అవుతారు రవి అన్న అని తెలిపారు.20 సంవత్సరాల నుంచి రవితేజ అన్ డ్యూటీ 29 నుంచి రామారావు అన్ డ్యూటీ అని తెలిపారు.