ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్బంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నగరంలోని బోరబండ , సనత్నగర్ , ఎర్రగడ్డ, ఖైరాతాబాద్ , అంబర్పేట్ , గోషామహల్, IS సదన్, తదితర ప్రాంతాల్లోని పలు బస్తీలలో పేద ప్రజలకు 9వేల లీటర్ల పాలు , చెక్కర , టీ పొడి పంపిణి చేయటం జరిగింది.
ఈ సందర్బంగా GHMC మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం పాలపై కూడా GST విధంచడం చాల విచారకరమని ఈరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్బంగా సేవ కార్యక్రమాల పిలుపు లో భాగంగా నిత్య అవసర వస్తువులను పేద ప్రజలకు అందించడం జరిగిందని , ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ కనులు తెరిచి పాలపై , నిత్య అవసర వస్తులులపై విధించిన GST ని రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు , లేని పక్షం లో భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురి అయ్యి పతనం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, పార్టీ నాయకులు స్వాతి, మేరీ, అజయ్, కృష్ణవేణి, రాధా, శ్రీకాంత్, సామ స్వప్న సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.