ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం కేసీఆర్…

52
kcr
- Advertisement -

తెలంగాణలో మ‌రో మూడు, నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది. ఎగువ నుంచి గోదావ‌రిలోకి భారీ వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం ఉందని…. దీంతో గోదావ‌రి ప‌రివాహ‌క జిల్లాల‌కు చెందిన మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడాలని సీఎం అదేశించారు.

ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాగ‌ల 3 రోజులు అతి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య‌, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని కూడా హెచ్చ‌రించింది. మోస్త‌రు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని తెలిపింది. ఇప్ప‌టికే సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధికంగా న‌మోదు అయింద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

- Advertisement -