- Advertisement -
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అతను 16.68 మీటర్ల దూరం దూకాడు. వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భారతీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబాకర్‌లు క్వాలిఫయింగ్ రౌండ్‌లో విఫలం అయ్యారు. ఎల్డోజ్ పౌల్ కన్నా పర్సనల్ బెస్ట్ ఉన్న ఆ ఇద్దరూ సరైన సమయంలో రాణించలేకపోయారు.
- Advertisement -