దేశాన్నికి రవాణా సౌక్యర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. కేంద్రంలోని ప్రభుత్వం మాత్రము తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. కాని స్వరాష్ట్రంలో ప్రతి పల్లెకు పట్టణాన్నికి రోడ్లను నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లు వేయడం ప్రభుత్వం వంతు, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యతాన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ నుంచి బాన్సువాడ-గాంధారి ఆర్ అండ్ బీ రహదారి వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను స్పీకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ రోడ్డు వేస్తున్నారు. వందేళ్ల వరకు చెక్కు చెదరదన్నారు. రోడ్లపై కేజ్ వీల్ ట్రాక్టర్లను నడపొద్దని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారని స్పీకర్ తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.