దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే తర్వాత బాలీవుడ్‌కు వెళ్లినా అక్కడ అవకాశాలు లేకపోవడంతో తన అందాల ఆరబోతతో వార్తల్లో నిలుస్తు వస్తోంది.
గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఈ అమ్మడు 2019లో ఆ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈ వేడుకల్లో ఇలియానా కూడా చేరింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరగా దీనిపై ఇల్లి బేబి ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి..