- Advertisement -
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అంతేగాక రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్, మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అల్పపీడనం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచికొట్టగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
- Advertisement -