- Advertisement -
సింగపూర్ ఓపెన్ టైటిల్‌ని సొంతం చేసుకుంది పీవీ సింధు. ఫైనల్స్‌లో చైనాకు చెందిన వాంగ్ జీ యీపై 21-9, 11-21, 21-15 తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారిగా సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను దక్కించుకున్నది. ఈఏడాది సింధుకు ఇది మూడో టైటిల్.
టోర్నీ ప్రారంభం నుంచి మెరుగైన ఆటతీరుతో దూసుకెళ్తున్న సింధు.. ఫైనల్‌లోనూ సత్తాచాటింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్‌లో విజేతగా నిలిచినప్పటికీ.. అవి రెండు సూపర్-300 టోర్నీలు. తాజాగా సింధు గెలుచుకున్న సింగపూర్ ఓపెన్ టైటిల్ సూపర్-500.
- Advertisement -