- Advertisement -
రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో గోదారి ఉగ్రరూపం దాల్చగా ప్రమాదకర స్ధాయిని మించి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు.
- Advertisement -