రాజపక్స సోదరులకు షాక్.. దేశం విడిచి వెళ్లొద్దు!

76
rajapakse
- Advertisement -

తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు గొటబాయ రాజపక్స. ఆయన రాజీనామాను స్పీకర్ అమోదించగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే శ్రీలంక సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్సలను దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తమ్ముడు బాసిల్ రాజపక్సే మంగళవారం కొలంబో విమానాశ్రయంలో వీఐపీ టెర్మినల్ ద్వారా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయాణం గురించి తెలుసుకున్న నిరసనకారులు ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టారు. దీంతో విమాన సిబ్బంది బాసిల్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు.

- Advertisement -