సీఎస్‌ సమీక్షా సమావేశం

62
cs
- Advertisement -


గోదావరి చరిత్రలో రెండోసారి వరద పోటెత్తుతున్న వేళ 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రాద్రి కలెక్టర్‌, ఎస్పీ సీఎస్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటిపారుదలశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

భద్రాచలంలో కొనసాగుతున్న వరదలు, సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. నీటిమట్టం 80 అడుగులకు చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే పునారవాస శిబిరాలకు తరలించాలని సూచించారు.

పది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఐదు ఆర్మీ, సింగరేణి బృందాలు భద్రాచలంలో ఉన్నాయన్నారు. వరదల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చూడాలన్నారు. రాత్రికి ఐటీసీ భద్రాచలంలో హెలికాప్టర్‌ అందుబాటులో ఉంటుందని సీఎస్‌ పేర్కొన్నారు. రాత్రికి నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుంటాయని చెప్పారు. భద్రాచలానికి బోటు, బస్సులు, ట్రక్కులు పంపుతున్నట్లు తెలిపారు. సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ కోసం సీనియర్‌ పోలీసు అధికారులను నియమించినట్లు డీజీపీ తెలిపారు.

- Advertisement -