- Advertisement -
రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా జూలైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని…చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.
ఇక భారీ వర్షాల వార్త కవరేజ్‌కు వెళ్లిన జగిత్యాలకు చెందిన జమీర్ మరణం అత్యంత బాధాకరమని… జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామని కవిత వెల్లడించారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -