గోదావరిలో చిక్కుకుపోయిన వారిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం

47
singareni
- Advertisement -

గోదావరిఖని సమీపంలో గోదావరి నదిలో చిక్కుకుపోయిన ఏడుగురు సింగరేణి కార్మికులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం గురువారం రక్షించింది. బుధవారం గోదావరిఖని కంపెనీ ఇన్‌టేక్‌ వెల్‌ వద్దకు వెళ్లిన సింగరేణి కార్మికులు, ఇన్‌టేక్‌వెల్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడే చిక్కుకుపోయారు. కార్మికులను రక్షించేందుకు స్థానిక బృందాలు ప్రయత్నించినప్పటికీ భారీగా వరద నీరు ప్రవహించడంతో పడవలు ఇన్‌టెక్‌ వెల్‌లోకి చేరుకోలేకపోయాయి. రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలియజేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సంఘటన వివరాలు తెలపడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేశారు. వెంటనే చిక్కుకుపోయిన సింగరేణి కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దిగాయి. గురువారం గోదావరిఖని చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కార్మికులను రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక శాసనసభ్యుడు చందర్ కూడా అక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేశారు.

- Advertisement -