ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌…దర్యాప్తు వేగవంతం

40
finger
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. గోశామహల్ SFA వెంకట్ రెడ్డి తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు గుర్తించారు.

యూట్యూబ్ లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు తెలిపారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్ లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారు. 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకోగా త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామని తెలిపారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

- Advertisement -