- Advertisement -
సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC15 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇటీవల పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తన నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకోనుంది. ఇందుకోసం అందాలభామ కియారా అద్వానీ కూడా హైదరాబాద్ చేరుకుంది. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తమన్ సంగీతం అందిస్తుండగా నేటి నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ పూర్తికాగా మిగితా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
- Advertisement -