- Advertisement -
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గోదావరికి ఎగువనుండి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.జలాశయంలో నీటి నిల్వసామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ఇప్పుడు 74.506 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి 2,45,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 34 గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087.40 అడుగులకు చేరింది.
- Advertisement -