కామారెడ్డి ఘటన.. రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్‌

49
kamareddy
- Advertisement -

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన హృదయాలను కలచి వేసిందన్నారు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి. విషయం తెలుసుకున్న వెంటనే మానవతా దృక్పథంతో మృతులకు రూ. 3 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రికి మంత్రి వేముల ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. కామారెడ్డి ఆస్ప‌త్రి వ‌ద్ద మృతుల కుటుంబ స‌భ్యుల‌ను ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను సీఎం కేసీఆర్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి.. అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న హైమద్ (35), అతని భార్య పర్వీన్(30), కుమారుడు అద్నాన్ (4), కూతురు మాహిమ్(6)ల మృతులుగా గుర్తించారు.

- Advertisement -