పుష్ప 2..బడ్జెట్ ఎంతో తెలుసా..?

59
allu
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా నిలవగా ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే కథలో మార్పులు చేస్తున్నారు సుక్కు.

తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ‘పుష్ప 2’ దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో మొదటి పార్ట్ హిట్‌తో వచ్చిన ఫేమ్‌తో అల్లు అర్జున్ ఆ పారితోషికాన్ని రూ.90 కోట్ల వరకూ పెంచేశాడట. అంతేకాకుండా లాభాల్లో సైతం వాటా తీసుకోనున్నట్లు వినికిడి.

ఈ బడ్జెట్ ప్రభాస్ నటించిన సాహో, బాహుబలి చిత్రాల బడ్జెట్‌తో సమానం కావడం విశేషం. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుండగా ప్రీ పొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -