- Advertisement -
బాలీవుడ్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్. రీసెంట్‌గా కొత్త సీజన్ మొదలుకాగా ఈ షో తొలి ఎపిసోడ్‌కి అలియాభట్, రణవీర్ సింగ్ గెస్టులుగా వచ్చారు. వీరిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాము ఇద్దరం ఎప్పట్నుంచో డేటింగ్ లో ఉన్నా మా ప్రేమని వ్యక్తపరచలేదని తెలిపి ఆలియా. బ్రహ్మాస్త్ర సినిమా వర్క్‌షాప్‌లో మేము బాగా దగ్గరయ్యాము. ఒకసారి ఇద్దరం కలిసి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మేము ఒకరికోసం ఒకరు అని అర్ధం చేసుకున్నామని తెలిపింది. కెన్యాలోని మసైమార జాతీయ రిజర్వ్ ఫారెస్ట్‌లో తనకు రణబీర్ ప్రపోజ్ చేశాడని…తాను అప్పుడే ఓకే చెప్పేశానని తెలిపింది.
రణబీర్ ఇంట్లో చాలా ట్రెడిషినల్ గా ఉంటారు. మన కల్చర్ ని బాగా ఫాలో అవుతారని తెలిపింది. రణబీర్ వాళ్ళ నాన్న ఇంట్లో పూజ జరిగేటప్పుడు లేకపోతే వీడియో కాల్ చేసి మరీ పూజలో పాల్గొంటారు అని వెల్లడించింది.
- Advertisement -