- Advertisement -
ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన బిలియనీర్ ఎలన్ మస్క్ తప్పుకున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అది విఫలమైంది. దీంతో ఆయన తన ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు తెలిపారు.
ట్విట్టర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేదని ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. మస్క్ అంగీకరించిన ధరకు, షరతులకు లోబడే కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు. బిలియన్ డాలర్ బ్రేకప్ ఫీజు కోసం కోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్‌ను కొనేందుకు ఏప్రిల్‌లో ఓకే చెప్పినా, మే నెలలో ఆ డీల్‌పై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ల నేపథ్యంలో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
- Advertisement -