సినిమాలకు అందుకే దూరంగా ఉన్నా!

90
venu
- Advertisement -

తొట్టెంపూడి వేణు…స్వయంవరం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో. చేసింది కొద్ది సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వేణు.

అయితే రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన వేణు…రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. తాను సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల, నా పర్సనల్ సమస్యల వల్ల ఇన్ని రోజులు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ ఇప్పుడు రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే పారా హుషార్‌ అనే మరో సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నానని తెలిపారు. చిరునవ్వుతో, గోపి గోపిక గోదావరి, హనుమాన్‌ జంక్షన్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, కళ్యాణ్ రాముడు వంటి సినిమాలతో హిట్ అందుకున్నారు వేణు.

- Advertisement -