పుష్ప 2లో విజయ్ సేతుప‌తి!

137
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం పుష్ప. బ‌న్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని త‌గ్గేదేలే డైలాగ్ రాజకీయ నాయ‌కులు సైతం వాడారంటే అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక ఈ సినిమా త‌ర్వాత పుష్ప 2పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవెల్ కి తగ్గట్టు, ఆడియన్స్ అంచనాలు అందుకోవటానికి క‌థ‌కు మ‌రింత మెరుగులు దిద్దుతున్నారు సుకుమార్.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త టీ టౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మెయిన్ విల‌న్‌గా విజయ్ సేతుపతి న‌టించ‌నున్నార‌ట‌. క‌థ చెప్ప‌డంతో విజ‌య్ సేత‌పుతి ఓకే చెప్పార‌ట‌. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

- Advertisement -