ఆటాలో తెలంగాణ పెవిలియన్‌

2605
kavitha
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ వలన అనేక మహాసభలు విరామం తీసుకున్నాయి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) వారి ఆద్వర్యంలో జరిగే మహాసభలు కూడా వాయిదాలు పడ్డాయి. అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు అంగ‌ర‌వంగ వైభ‌వంగా 17వ ఆటా మ‌హాస‌భ‌లు నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి అమెరికాలో స్థిర‌ప‌డిన ఎన్ఆర్‌ఐలు 15వేల మంది ఒకే చోట క‌లిసి మూడు రోజుల‌పాటు పండుగ చేసుకున్నారు.

ఈ వేడుక‌ల‌కు తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ క‌విత‌, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, చామ‌కూరి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గాద‌రి కిషోర్‌, చంటి క్రాంతి కిర‌ణ్‌, ర‌వీంద్ర‌కుమార్‌, టిఎస్ఐఐసి చైర్మ‌న్ గాద‌రి బాల‌మ‌ల్లు, ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. దీంతో ఆ వేదిక మొత్తం పండుగ వాతావ‌ర‌ణాన‌్ని సంత‌రించ‌ుకుంది.

మొద‌టి రోజు ప్ర‌ఖ్యాత ఇండియ‌న్ క్రికెట‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్‌, క‌పిల్ దేవ్‌లు, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ హాజ‌ర‌య్యారు. రెండో రోజు తెలంగాణ పెవిలియ‌న్‌ను ఎమ్మెల్సీ క‌విత ప్రారంభించారు. చివరిదైన మూడో రోజున కూడా ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి వాషింగ్ట‌న్ డీసీ గ‌వ‌ర్న‌ర్ హాజ‌ర‌య్యారు. మ్యూజిక్ లెజండ్ ఇళ‌య‌రాజా, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, ప‌ర్యావ‌ర‌ణ వేత్త జ‌గ్గీ వాసుదేవ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అనంతరం పలు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలును, ఈవెంట్స్‌, హాస్య‌వ‌ల్ల‌రులు నిర్వహించారు ఆటా ప్రతినిధులు. ఎన్ఆర్ఐ కుటుంబాలకు చెందిన స‌భ్యులు ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తెలుగు భాషా, సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ, ఎన్ఆర్ఐల అభివృద్ధి, వారి అభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు వంటి ప‌లు అంశాల మీద చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల్లో ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు. వారింద‌రినీ ఆటా ప్ర‌తినిధులు సత్క‌రించారు.

- Advertisement -