- Advertisement -
మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంను నిజం చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి మా సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ కొమురయ్య తెలంగాణ రైతాంగ పొరాట తొలి అమరుడని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆభివృద్ధే ద్యేయంగా పనిచేస్తున్నమన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి సబ్బండ వర్గాల ప్రజలను ఆభివృద్ధి పథంలో ముందుంచుతునమన్నారు
ఎన్ని డబుల్ ఇంజన్లు వచ్చిన మనది టర్బో ఇంజన్ ప్రభుత్వమన్నారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఆణువంత పాత్ర లేని బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చేప్పలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారన్నాయన బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు.
- Advertisement -