జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన కేంద్ర మంత్రి ఫీయూష్ గోయెల్ వానాకాలం పంట కొంటారా కొనరా అని నిలదీశారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలో యాసంగి పంటలు కొనకపోయిన రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణలో వరి వేసే రైతులపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా రా రైస్ కొనమంటే తెలంగాణ రైతులు ఏం పండించాలో చేప్పాలన్నారు. రైతులపై భారం వేయకుండా భేషరతుగా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల.
బీసీ ప్రధానమంత్రి బీసీల కోసం ఏం చేశారో తెలపాలన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని, మంత్రుత్వ శాఖలో శాఖ ఉండాలని కేసీఆర్ ఆధ్వర్యంలో గతంలో మోదీని కలిసినప్పుడు చేప్పాం కాని ఇంతవరకు దాన్ని ఎందుకు అమలు చేయలేదన్నారు. బీసీ జనగణన, కులగణన చెపట్టాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్న్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు. బీసీలపై బీజేపీ వైఖరి ఎంటో స్పష్టంగా చెప్పాలన్నారు.