బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ : హరీష్‌ రావు

74
harish
- Advertisement -

రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ ప్రజలకు నిరాశ కల్పించారన్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపొగా తెలంగాణపై విషం గక్కారన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలపైన కనీసం మాట్లాడకపొవడం సిగ్గుచేటన్నారు. 18రాష్ట్రాల సీఎంలు వచ్చి విషం చిమ్మి వేళ్లారే కాని తెలంగాణ అభివృద్ధి వాళ్లకు కనపడలేదన్నారు.


అమిత్‌షా కు తెలంగాణలోని పచ్చని పొలాలు కనిపించపోవడం చాలా భాధాకరమన్నారు. తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలు సిద్ధాంతంతోనే తెలంగాణ వచ్చిందన్నాయన నిధులు తెలంగాణకు ఎంత ఇచ్చారో చెప్పలేదన్నారు కాని రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల్లో వాటాలు మాత్రం తీసుకుపొతారని ఎద్దేవా చేశారు.

అమిత్‌ షా నాతో రండి తెలంగాణ మొత్తం తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు చూపిస్తన్నారు….తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లు రాని ఇంటిని చూపిస్తావా…తెలంగాణకు నిధులు కెటాయించని మీరు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కరీంనగర్‌ జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందన్నారు. నీళ్లు రాక పోతే మోడీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నామంటారు . పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయన్నారు. 2కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం నీళ్లు రాక పోతే ఎలా పండుతుందన్నారు. గత సంవత్సరం లో 21 శాతం వృద్ధి రేటు నమోదయిందన్నాయన…. జాతీయ స్థాయి లో 3 శాతం వాటా తెలంగాణ నమోదు చేసిందన్నారు.

వ్యవసాయంలో తెలంగాణ 10 శాతం వృద్ధి రేటు పెరిగిందని నీతి యోగ్ లెక్కలే చెబుతున్నాయి కావలంటే పత్రాలు తెచ్చుకొని చూడమన్నారు. నిజాలు చెప్పక అమిత్ షా అభాసు పాలయి తన స్థాయిని తగ్గించుకున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవక, రిపోర్టులు తెచ్చుకొమన్నారు. మా నిధులు ఖర్చు పెట్టనిదే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎలా పూర్తవుతాయన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఇపుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందన్నారు. జీఎస్‌డీపీ 11 లక్షలకోట్ల కు పెరిగిందన్నారు. దేశ జీడీపీకి తెలంగాణ ఒక శాతం అదనంగా అదాయంసమకూర్చిందన్నారు. తెలంగాణ వాటా 4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగిందన్నారు.

సంపద పెంచాం గనుకే తెలంగాణ లో సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్ ల కన్నా ఎక్కువ ఉందన్నారు. యూపీ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా మూడు రెట్లు తక్కువన్నారు. కేసీఆర్ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ కన్నా ఎక్కువ ప్రగతిని సాధిస్తున్నమన్నారు. రైతు బంధు తీసుకున్న రైతును అడిగితె తెలుస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మీ చెక్కు తీసుకున్న మహిళను అడుగు తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతారన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి 11 లక్షల హెక్టార్లలో కోట్ల రూపాయలు వివిధ రంగాల పై ఖర్చు పెట్టాం నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ భగీరథకు నిధులు ప్రకటిస్తారని ఆశించాం కాని నిధులు ఇవ్వకుండా తిట్లు మాత్రం ఇచ్చారన్నారు. మాకు న్యాయ బద్దంగా రావాల్సిన నిధులు ఇస్తే తెలంగాణ మరింతగా దూసుకు పోయేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ను బుట్ట దాఖలు చేసిన ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వమేన్నారు.

నియామకాలు జరిగాయా అని ప్రశ్నిస్తున్న అమిత్ షా బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు. దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. 16న్నర లక్షల ఉద్యోగాలు కేంద్రం లో ఖాళీగా ఉంటే ఎన్ని నింపారన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్షన్నర ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేశామన్నారు. లక్షా 32 వేలు భర్తీ చేశామన్నారు. 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ అమిత్ షా ఎదో చెబితే నమ్మడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరూ లేరన్నారు.

పీఎం మోడీ కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నామని అబద్ధమడారు. తెలంగాణ ప్రతీ ఏటా ఉచిత బియ్యం పైన 4246 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా తెలంగాణకు వెచ్చిస్తోంది కేవలం 170 కోట్లే కాని ఆరోగ్య శ్రీ ద్వారా మేము 900 కోట్లు వెచ్చిస్తున్నమన్నారు. 85 లక్షల మంది కి ఆరోగ్య శ్రీ వర్తిస్తే కేవలం 26 లక్షల మంది కే ఆయుష్మాన్ భారత్ వర్తించేలా చేశారన్నారు మంత్రి హరీష్ రావు. మహిళకు కన్నీళ్లు తెప్పిస్తున్న సీలిండర్ ధర పెంచిన విషయం ఎందుకు మోడీ చెప్పలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయం ఎందుకు మోడీ మాట్లాడలేదన్నారు. సాగు నీటి ప్రాజెక్టులకు సాయం చేశారా….చేయక పోగా అడ్డంకులు సృష్టించారు.

ప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిందని అన్యాయంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు అనుమతులిచ్చి 80 వేల కోట్ల రుణానికి ఆమోదించింది మీ కేంద్రమే కాదా. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం లో అవినీతి జరగలేదని మీ కేంద్రమంత్రి చెప్పారు. కరెంటుమోటర్లకు మీటర్లు పెట్టాలనుకునే వారికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఎలా అర్థమవుతుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు

బీజేపీ వారికి ఎటీఎమ్ అంటే ఎనీ టైం మీటర్.. కాని కాళేశ్వరం మా దృష్టిలో ఎనీ టైం వాటర్. అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు మంత్రి హరీష్ రావు.

రూపాయి విలువ తగ్గిస్తామన్నారు పెంచి ఫెయిల్ అయ్యారు. నల్ల ధనం తెస్తామన్నారు.. ఫెయిల్ అయ్యారు. లోక్ పాల్ బిల్లు తెస్తామన్నారు ఫెయిల్ అయ్యారు. తీవ్రవాద నియంత్రణ లో కూడా ఫెయిల్ అయ్యారు….ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ వైఫల్యాల జాబితా చాంతాదంతా ఉంటుందన్నారు.

ఎనిమిదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వరంగల్‌ ఇస్తామని గుజరాత్ కు, మహారాష్ట్ర లాతూర్ కీ తీసుకెళ్లారు. ఎస్టీ రిజెర్వేషన్ల పెంపు ఊసే లేదన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం హామీ గంగలో కలిపారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటోంది.. ఉద్యమంలో బీజేపీ ఎక్కడుందన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాల విలువ బీజేపీకి ఎం తెలుసన్నాయన …తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రతిసారి విషం గక్కుతున్నారు…మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణను బీజేపీ ఎందుకు ఇవ్వలేకపోయిందో చెప్పాలన్నారు. తెలంగాణ మీద ప్రేముంటే బీజేపీ ప్రభుత్వం విభజన చట్టం హామీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మాకు తెలంగాణ ప్రజలే బాస్‌లు మాకు బాస్‌లు ఢిల్లీలో లేరు…..ప్రజలే అంతిమ నిర్ణేతలన్నారు.

స్థాయి మరిచి మాట్లడితే తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. పచ్చటి పొలాలను, మత్తడి దుంకుతున్న చెరువులను అడిగితే కేసీఆర్ ఎవరో చెబుతాయన ..స్థాయి మరిచి మాట్లాడటం మంచిది కాదన్నారు. కేసీఆర్ అంకిత భావం వల్లే తెలంగాణ దూసుకు పోతోందన్నారు.

- Advertisement -