- Advertisement -
తెలంగాణలో బోనాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఇక గత పదమూడేళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు.
ఈ ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికిపైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడి బియ్యంతోపాటు కృష్ణమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు.
- Advertisement -