బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ,హైదరాబాద్ మహానగరం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ విదేశి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్న మోదీ…హైదరాబాద్ డైనమిక్ సిటీగా గుర్తించి ట్వీట్ ద్వారా ఒప్పుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను డైనమిక్ సిటీగా గుర్తించినందుకు మోదీకి ప్రత్యేక ధన్యావాదాలు అని తలసాని రీట్వీట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంగీకరించనప్పటికీ.. సాక్షత్తూ మోదీనే హైదరాబాద్ డైనమిక్ సిటీ అంటూ పరోక్షంగా ప్రశంసలు కురిపించడం….రాష్ట్ర బీజేపీ అల్ప బుద్దికి ఇదొక చెంపపెట్టు లాంటిందన్నారు.
ఈ ట్వీట్‌లో తలసాని.. టీ హబ్ -2, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం, ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి ఫోటోలను జత చేశారు.