యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం..

62
cm
- Advertisement -

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌కు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అనంత‌రం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జ‌ల‌విహార్‌కు బైక్ ర్యాలీగా త‌ర‌లివెళ్లారు.

యశ్వంత్ సిన్హా నేపథ్యం ఇదే..

యశ్వంత్ సిన్హా బీహార్ లోని పాట్నాలో 1937 నవంబర్ 6న కాయస్థ కుటుంబంలో జన్మించారు. ఈయన రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.సిన్హా కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం 1960 వరకు పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన… ఆయన ఇండియన్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు ఎంపికయ్యి 24ఏళ్ల పాటు ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ గా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాలలో పనిచేశారు. 1971 నుంచి 1974 వరకు జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి మొదటి కార్యదర్శిగా నియమించబడ్డారు.1984 లో తన పదవికి రాజీనామా చేశారు.

1986 లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూనే 1988లో మొదటిసారిగా జనతా పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. 1989లో జనతాదల్ తో పొత్తు తర్వాత, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కుడా పనిచేశారు. 1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. 1992 లో బీజేపీ పార్టీలో చేరి, అనతి కాలంలో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.1996లో లోక్ సభకు ఎన్నికయ్యి 1998 లో వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ మరొకసారి తన మార్క్ చూపించారు. 2002 లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 లో మళ్లీ హాజరీబాగ్ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించి 2018 లో బీజేపీని వీడారు. 2021 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు. ప్రస్తుతం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.

- Advertisement -