పక్కా కమర్షియల్..తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?

32
gopichand
- Advertisement -

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ మారుతీ దర్శకత్వంలో చేసిన మూవీ ‘పక్కా కమర్షియల్’. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక చాలాకాలం తర్వాత గోపిచంద్ ఈ సినిమాతో హిట్ కొట్టారు.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్–యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన రాశీఖ‌న్నా హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -