- Advertisement -
ఇరాన్లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. ఉదయం హర్మోజ్‌గంజ్ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్ అబ్బాస్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. దీని ప్రభావంతో ముగ్గురు మరణించగా 19 మంది గాయపడ్డారు.
హర్మోజ్‌గంజ్ ప్రావిన్స్‌లో గతేడాది నవంబర్‌లో 6.4, 6.3 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు వచ్చాయి. 1990లో వచ్చిన 7.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంతో సుమారు 40 వేల మంది మరణించారు. కాగా, గతవారం అఫ్గానిస్థాన్‌లో వచ్చిన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
- Advertisement -