వెండితెరపై వాజ్‌పేయి జీవిత కథ!

58
atal
- Advertisement -

వెండితెరపై బయోపిక్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకురాగా మంచి ఆదరణ పొందాయి.

తాజాగా దివంగత మాజీ ప్రధాని, బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రానుంది. మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే-అటల్‌ అనే టైటిల్‌తో వినోద్‌ భన్సాలీ, సందీప్ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఉల్లేక్‌ ఏన్‌పీ రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు కాలేదు. అటల్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 25. వచ్చే ఏడాది 99వ జయంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -