- Advertisement -
నటి మీనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి చెన్నైలో మృతిచెందారు. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారిన పడగా తర్వాత విద్యాసాగర్‌కు లివర్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అది తీవ్రం కావడంతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించిన కుదరలేదు.
దీంతో పరిస్థితి మరింత విషమించి ఆయన మృతి చెందారు. విద్యాసాగర్ మృతితో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగపోయారు. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఇవాళ చెన్నైలో విద్యాసాగర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
- Advertisement -