68.10 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు

59
rythu bandhu
- Advertisement -

నేటి నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఈ సారి కొత్తవారిని కూడా చేర్చడంతో మొత్తం 68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులయ్యారు. మొత్తం కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతు బంధు సాయం అందనుండగా ఇందుకు రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు. రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు డ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -