తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్‌తో గురువారం యాంగ్ లియూ భేటీ అయ్యారు. తన కంపెనీకి చెందిన ప్రతినిధి బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చిన లియూ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌పై కీలక చర్చ జరిగింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ లియూను కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, సౌకర్యాల గురించి కేటీఆర్ లియూ బృందానికి వివరించారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడికి హామీ దక్కేసిందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.